దక్షిణాఫ్రికాపై రాబోయే మూడు-మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ లో టాప్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ శర్మ భాగస్వామ్యం వహించ బోతున్నాడని భారతీయ సెలెక్టర్లు నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు.
కె.ఎల్.రాహుల్ న్యూస్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది మరియు వెస్టిండీస్ యొక్క భారత పర్యటన సందర్భంగా సైతమూ అతడు తన పేలవమైన పరుగులను కొనసాగించాడు. డోపింగ్ నిషేధముతో పృధ్వీ షా ఈ సంవత్సరాంతం వరకూ బయటే ఉండిపోవడంతో, రోహిత్ తన తెలుపు-బంతి ఫామ్ ను భారతీయ టెస్ట్ క్రికెట్ జట్టు గుండా తీసుకువెళ్ళగలడని సెలెక్టర్లు మరియు జట్టు యాజమాన్యము ఆశిస్తున్నారు.
రోహిత్ యొక్క సామర్థ్యము ఉండే ఆటగాడిపై వాళ్ళు ఎందుకు విశ్వాసముంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు, బహుశా దేశవాళీ క్రికెట్ లో కనబరచిన పనితీరును బట్టి రోహిత్ లాంటి పిలవదగిన అర్హత ఉన్నవారిగా పరిగణించబడే మరి కొద్దిమంది ఆటగాళ్ళు ఉండవచ్చు. వారి వైపు ఒకసారి చూద్దాం.
Reading about the batting exploits of Gujarat’s ‘Mr Consistent’ Priyank Panchal in the 2nd unofficial Test for India v SA A, I wonder when the selectors will give him a go in the Test team. With a 1st class average of over 47, few have matched his consistency in domestic cricket. pic.twitter.com/whs07kbOZj
— Dan Redford (@danredford70) September 21, 2019
ప్రియాంక్ పాంచాల్ ఇండియా-ఎ మరియు దక్షిణాఫ్రికా -ఎ మధ్య డ్రా గా ముగిసిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో శతకం బాదడం ద్వారా గుజరాత్ కు చెందిన 29-ఏళ్ళ ఈ బ్యాట్స్‌మన్ ఇటీవల పతాక శీర్షికల్లో నిలిచాడు. అనేక సంవత్సరాలుగా ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో ఇతడు ఒక ఉత్తమ పరుగుల వేటగాడిగా ఉంటున్నాడు మరియు 47.37 సగటుతో 6301 పరుగులు ఆ వాస్తవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ పరుగులలో యాభై-ప్లస్ స్కోరులు 45 ఉన్నాయి, అందులో 22 శతకాలు ఉన్నాయి. పైపెచ్చు, అతనికి 314* యొక్క అత్యుత్తమ స్కోర్ కూడా ఉంది మరియు ఒక ఓపెనర్ గా అతని సాహసస్వభావం మరియు స్థిరత్వాన్ని అది తెలియజేస్తుంది.
అభిమన్యు ఈశ్వరన్: 2018/19 రంజీ సీజనులో బ్యాట్ తో ఆకట్టుకునే విధంగా చేసిన కొన్ని నక్షత్ర ప్రదర్శనా విన్యాసాల నేపధ్యములో ఈ 23 – ఏళ్ళ కుర్రాడు బెంగాల్ యొక్క కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఈ సీజనులో ఈశ్వరన్ అత్యద్భుతమైన 95.65 సగటుతో 861 పరుగులు స్కోర్ చేశాడు. పైపెచ్చు, గత నాలుగు రంజీ సీజనులలో కూడా అతని సగటు ఎప్పుడూ 40 దిగువకు పడిపోలేదు. 48.91 సగటుతో అతని మొత్తమ్మీద ఫస్ట్ క్లాస్ క్రికెట్ యొక్క 4109 పరుగులు చూస్తే, అతను ఎంత చక్కని బ్యాట్స్‌మన్ అనే విషయం బోధపడుతుంది. మరియు ఈ పరుగులలో 13 శతకాలు మరియు 17 యాభైలు కూడా ఉన్నాయి.
Keep your dreams alive. Because everything is possible for those who believe!? Winning the trophy against South Africa A. Well done boys! #INDAvSAA pic.twitter.com/Yasz99PIij
— Jalaj Saxena (@jalajsaxena33) September 20, 2019
జలజ్ సక్సేనా: మొత్తమ్మీద ఫస్ట్ క్లాస్ కెరీర్ సగటు 37.68 ఉండటం అనేది ఒక ఓపెనర్ కు అంత గొప్పగా ఆకట్టుకునే విషయం కాకపోవచ్చు కానీ, జలజ్ ఎల్లప్పుడూ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గానే ఉండేవాడు కాదు. 2016 లో అతడు కేరళకు మారినప్పటి నుండి మాత్రమే అతడు క్రమం తప్పకుండా ఓపెనింగ్ ప్రారంభించాడు మరియు అప్పటినుండి నిజమైన బ్యాట్స్‌మన్ గా ముందుకొచ్చాడు. గత రెండు రంజీ సీజన్లలో కేరళతో అతడు ఆకట్టుకునే 44.70 సగటుతో 1000 కి పైగా పరుగులు సాధించాడు. ఈ పరుగులలో మూడు శతకాలు మరియు ఐదు యాభైలు కూడా ఉన్నాయి. పైపెచ్చు, జలజ్ అందించే దోహదాంశం కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు. అతడు 28.12 సగటుతో తన పేరిట 300 కు పైగా ఫస్ట్ క్లాస్ వికెట్లు పొంది ఉన్నాడు, మరియు టెస్ట్ పరంగా అతను భారత క్రికెట్ జట్టు కు ఎంత విలువైన ఆస్తిగా తయారవుతాడో అనే విషయాన్ని అది తెలియజేస్తుంది.
రచన:ప్రసెంజిత్ డే