కజగిస్థాన్ లోని నూర్-సుల్తాన్ లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పోటీ పడేందుకు వెళ్ళిన 30 – మంది రెజ్లర్ల గట్టి పోటీదారుల బృందము నుండి ఆకాంక్షలు ఎక్కువగానే ఉండినాయి మరియు అందుకు తగ్గట్టుగానే వారు నిరుత్సాహపరచలేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుండి ఐదు మంది పతకాలతో భారత్ కు తిరిగి రావడం కంటే మించి అత్యుత్తమ ప్రదర్శన ఇంకేముంటుంది, ఇది 2020 ఒలంపిక్స్ నుండి కేవలం ఒక సంవత్సరం దూరంలో ఉన్నందుకు శుభ సంకేతంగా ఉంటుంది. విజేతలను ఒకసారి చూద్దాం:
1.దీపక్ పునియా
టోర్నమెంటు విషయానికి వస్తే, బొటనవ్రేలు మరియు భుజం గాయాలతో బాధపడుతున్న దీపక్ పునియా 86 కిలోల విభాగములో పోటీ పడుతూ స్థానిక ఫేవరేట్ అడిలెట్ దావ్‌లుంబాయేవ్ పై మొదటి రౌండులో 0-5 తో వెనుకబడి, ఐనా సరే పుంజుకొని పోరును 8-6 తో గెలుచుకొని అక్కడ హాజరైన ప్రేక్షకులందరినీ నిశ్శబ్దానికి గురి చేశాడు. ప్రీ-క్వార్టర్స్ లో అతడు తుర్క్‌మెనిస్థాన్ యొక్క కొదిరోవ్ ను ఓడించి, ఆ తదుపరి క్వార్టర్స్ లో కొలంబియాకు చెందిన కార్లోస్ ఆర్టురో ఇజ్క్వియెర్డో మెండెజ్ ను మట్టి కరిపించాడు. ఫైనల్ లో చోటు కోసం అతడు స్విట్జర్లాండ్ కు చెందిన స్టీఫన్ రీచ్‌మూత్ ను ఎదుర్కొన్నాడు, అయితే గాయం బాధించిన కారణంగా అతని సెమీఫైనల్ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ గ్రాప్లర్ రజతంతో సరిపెట్టుకున్నాడు మరియు టోక్యో ప్రయాణం కోసం తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
2.బజ్‌రంగ్ పునియా
ప్రపంచ నంబర్ 1 (65 కిలోలు) బజరంగ్ పునియా తన వెయిట్ విభాగములో బంగారు పతకం గెలవడానికి ఫేవరేట్ గా ఉన్నాడు, ఐతే కొంత వివాదం మధ్య కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని వివాదాస్పద రిఫరీ నిర్ణయాల కారణంగా ఈ రెజ్లర్ కజకిస్థాన్ కు చెందిన షాకెన్ నియాజ్‌బెకోవ్ చేతిలో తనకు తాను వెనుకబడ్డాడు, ఐతే సమయం, ముగిసేసరికి స్కోరును సమం చేసేలా తిరిగి పోరాడాడు. ఏది ఏమైనా, మ్యాచ్ యొక్క అత్యధిక స్కోరింగ్ మూవ్ కలిగియున్న కారణంగా, బజరంగ్ కు మరియు మనదేశ ప్రేక్షకుల ఉర్రూతలకు ఎక్కువ నిరాశ కలిగిస్తూ విజయం కజక్ నే వరించింది. ఉత్కంఠ కలిగించిన పోరులో అతడు మంగోలియన్ తుల్గా తుమర్ ఓచిర్ ను 8-7 స్కోరుతో ఓడించి కాంస్యంతో స్వదేశం వచ్చాడు.
While the world is waiting to watch the #Tokyo2020 #Olympics, it is a matter of pride that 5 #Indian wrestlers have qualified for the same. Congratulations to @Phogat_Vinesh, @BajrangPunia, #DeepakPunia, #RaviKumar & @rahulbaware1!@KirenRijiju @FederationWrest @IndianOlympians pic.twitter.com/KscC6gGNcQ
— Dhanraj Nathwani (@DhanrajNathwani) September 24, 2019
3 వినేష్ ఫోగట్
రెండు సార్లు కామన్‌వెల్త్ బంగారు పతక విజేత వినేష్ ఫోగట్, రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో ఒక పతకం గెలుపొందిన ఐదవ మహిళా రెజ్లర్ గా గుర్తింపు పొంది ఒక విఖ్యాతుల జాబితాలో చేరిపోయారు. ప్రీ-క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ మయూ ముకైడా చేతిలో ఒక ఓటమిని భరిస్తూ, ఫోగట్ ఈ పోటీలలో ముందుకు వెళ్ళి, స్వీడన్ కు చెందిన సోఫియా మ్యాట్సన్ ను ఎదుర్కొని 13-0 తో ఆ తర్వాత ఉక్రెయిన్ యొక్క యులియా ఖావల్డ్‌జీ బ్లాహిన్యా ను 5-0 తో ఓడించి ప్రపంచ నం.1 సారా ఆన్ హిల్డర్బ్రాండిట్ తో పోరుకు సిద్ధమైంది. టాప్ సీడ్ ను సాగనంపడానికి ఆమె తన రక్షణాత్మక విధానాన్ని ప్రదర్శించింది, మరి ఆ తర్వాత రెండు సార్లు కాంస్యం గెలుపొందిన మరియా ప్రివోలార్కీ ను ఓడించి ఈవెంటులో తన మొదటి పతకాన్ని ఒడిసిపట్టుకుంది.
4.రాహుల్ అవారే
27- సంవత్సరాల రాహుల్ అవారే, 61 కిలోల విభాగములో కాంస్యం గెలుపొందడం ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో తన మొట్టమొదటి పతకాన్ని సాధించుకున్నాడు. అవారే సెమీస్ వరకూ వెళ్ళగలిగాడు కానీ, తీవ్రమైన పోరు తర్వాత జార్జియాకు చెందిన బెకో లోమ్టాడ్జ్ చేతిలో 6-10 తో ఓటమి చెందాడు. కాంస్య పతక పోరులో అతడు 11-4 తో సౌకర్యవంతంగా అమెరికాకు చెందిన టైలర్ లీ గ్రాఫ్ ను సాగనంపి ఏడాదిలో రెండవ పతకాన్ని గెలుచుకున్నాడు, తదుపరి ఏప్రిల్ లో చైనా లోని గ్జియాన్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ లో కాంస్యం గెలుపొందాడు. 2018 కామన్‌వెల్త్ క్రీడలలో బంగారు పతకాన్ని కూడా గెలుచుకొని అవారే, గత రెండు సంవత్సరాలలో తన పతకాల సంఖ్యను రెట్టింపుకు మించి చేసుకున్నాడు.
5.రవికుమార్ దహియా
భారతీయ పోటీదారుల పైకీ అత్యంత ఆకట్టుకున్న కాంస్య పతక విజేత ఎవరంటే అది బహుశః అత్యంత పిన్న వయస్కుడు రవికుమార్ దహియా అవుతాడు, అతడు తన ప్రప్రథమ సీనియర్ పతకం గెలుపొందడానికి ప్రముఖ పోటీదారులను సునాయాసంగా ఓడించాడు.పోటీ యొక్క తొలి రౌండ్లలో జపాన్ కు చెందిన ప్రపంచ నంబర్ 3 యుకీ తనాహషీని ఓడించడానికి ముందు రవి, ఆర్మీనియా నుండి యూరోపియన్ ఛాంపియన్ ఆర్సెన్ హరుతున్యాన్ ను ఓడించాడు. అతడు రష్యాకు చెందిన జావుర్ ఉగుయేవ్ చే బంగారు పతకం పోటీ నుండి నెట్టివేయబడ్డాడు, ఐతే కాంస్య పతకం కోసం ఇరాన్ కు చెందిన రేజా అహమదాలీ అత్రినఘార్చీపై ముఖాముఖీ తలపడ్డాడు. అతడు అప్పటి ఏషియన్ ఛాంపియన్ ను 6-3 తో మట్టి కరిపించాడు మరియు ఒక కాంస్య పతకం ముగింపుతో మొట్టమొదటి సీనియర్ గా ఆకట్టుకున్నాడు.
రచన: క్రీడా ముఖాముఖీ