క్రీడల శ్రేష్టత కొరకు బెంగళూరు లో ఉన్న పదుకోనె-ద్రావిడ్ సెంటర్, 10 వ వార్షిక ఏషియన్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ కొరకు ఆతిథ్యమిస్తోంది, ఇందులో ఆసియా ఖండం వ్యాప్తంగా అథ్లెట్లు స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ (కళాత్మక) స్విమ్మింగ్, వాటర్ పోలో మరియు డైవింగ్ లో పోటీపడతారు.
ఈ ఈవెంటు ఒలంపిక్స్ కు ఒక క్వాలిఫయర్ గా కూడా పని చేస్తుంది కాబట్టి ఇది భారీ ప్రాధాన్యత కలిగి ఉంటుంది, మరియు భారత ఏస్ స్విమ్మర్లు టొక్యో గేమ్స్ 2020 లో తాము తమ స్థానం పొందడం కోసం పోటీ పడతారు. ఒలంపిక్ బెర్తుకు కేవలం అంగుళం దూరములో ఉన్నారు కాబట్టి అందరి కళ్ళూ సాజన్ ప్రకాష్ మరియు శ్రీహరి నటరాజ్ పైనే ఉంటాయి.
200 మీటర్ల బటర్‌ఫ్లై లో ప్రకాష్ బి-మార్కును స్పష్టం చేసుకోగా, నటరాజ్ ఇంతవరకూ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంటును చేశాడు మరియు ఒకవేళ ఇటీవలి ఫార్మ్ గనక అలాగే ఉంటే, ఆ తర్వాతిది ఈవెంటులో ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఈ నెల మొదట్లో జరిగిన 73 వ గ్లెన్‌మార్క్ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ లో, 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ మరియు 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంటులలో నటరాజ్ బంగారు పతకం పొందాడు మరియు రెండు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంటులలోనూ జాతీయ రికార్డును కూడా క్లెయిము చేస్తున్నాడు. అతని పనితీరు భారతదేశం లోని ఆక్వాటిక్ వలయములో ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు పొంది ఉండగా, ఈ బెంగళూరు ఈతగాడు ఈ సంవత్సరం జనవరిలో 18 ఏళ్ళ వయసుకు రావడం నటరాజ్ గురించి మరింత ఘనంగా చెప్పుకోవాల్సిన అంశము.
మామూలుగా ‘యువ సంచలనం’ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది కానీ, నటరాజ్ విషయములో మాత్రం అది కచ్చితంగా నిజం అవుతుంది. ఈ ఈతగాడు ఈ దశకం ప్రారంభము నుండీ మొదటి స్థాయి నుండీ అనేక టైటిళ్ళను గెలుస్తూ వస్తున్నాడు మరియు పూల్ లోనికి డైవ్ చేసిన ప్రతిసారీ అతడు మాత్రమే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. 2018 లో ఆసియా క్రీడల్లో, నటరాజ్ 100 మీటర్లు మరియు 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో వరుసగా 55.86 సెకెన్లు మరియు 2:02.37 సెకెన్లలో పూర్తి చేస్తూ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ల కోసం బి-మార్క్ సాధించుకున్నాడు. కేవలం కొన్ని నెలల తర్వాత, అత్యద్భుతమైన మెరుగుదలతో అతడు 100 మీటర్లలో అతి తక్కువ సమయం 54.18 సెకెన్ల వద్ద నిలిచాడు మరియు ఒలంపిక్స్ కొరకు బి-మార్కును సాధించాడు.
India's ?? Srihari Nataraj qualifies for the final of the 100M backstroke at the 7th FINA World Junior Swimming Championships 2019.
His timing in the semis is 0.84 seconds behind the Olympic 'A' qualification mark (53.85 seconds).#FINAJrWorlds #Swimming #Tokyo2020 pic.twitter.com/2R9ROgjU9K
— Naveen Peter (@peterspeaking) August 20, 2019
తాను 5 ఏళ్ళ వయసు నుండీ ఈత కొడుతూ, నటరాజ్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఐతే ఆ స్థాయికి మించిన ఆధిపత్యాన్ని సాధించాలని కూడా కలలు కంటున్నాడు. బ్యాక్‌స్ట్రోక్ లో అతని ప్రావీణ్యం అత్యద్భుతంగా ఉంది, మరియు అతడు టోక్యో 2020 యొక్క 100 మీటర్ల ఈవెంటులో ఎ- మార్క్ కోసం కేవలం 0.84 సెకెన్ల దూరములో ఉన్నాడు. చరిత్ర సృష్టించడానికి నటరాజ్ అతి సమీపములో ఉన్నాడు. ఒకవేళ అతను ఈ అడ్డంకిని గనక అధిగమించినట్లయితే, ఒలంపిక్స్ లో పోటీపడేందుకు అతను మొట్టమొదటి భారతీయుడవుతాడు. 19 ఏళ్ళ వయసులో, మైకేల్ ఫెల్ప్స్ తన మొట్టమొదటి ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నాడు. మరి అంతా సవ్యంగా జరిగితే, 19 ఏళ్ళ శ్రీహరి నటరాజ్, నేటి నుండి ఒక సంవత్సరం లోపున టోక్యో వెళ్ళే విమానంలో ఉంటాడు.
రచన: క్రీడా ముఖాముఖీ